లాడ్జీలలో పోలీస్ నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు
సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాపులు, లాడ్జీలలో జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, రవాణా, అమ్మకం, సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ నటేష్ తెలిపారు.