ఫ్లైట్‌లో ప్రాణం పోతుంటే.. కాపాడిన మాజీ ఎమ్మెల్యే!

ఫ్లైట్‌లో ప్రాణం పోతుంటే.. కాపాడిన మాజీ ఎమ్మెల్యే!

గోవా-ఢిల్లీ ఫ్లైట్‌లో ఓ అమెరికన్ మహిళ ప్రాణాన్ని ఖానాపూర్ మాజీ MLA డా. అంజలి నింబాల్కర్ కాపాడారు. మహిళకు సడెన్‌గా పల్స్ ఆగిపోగా అంజలి వెంటనే స్పందించి రెండుసార్లు CPR చేశారు. పోయే ప్రాణాన్ని నిలిపి, విమానం దిగేవరకు పక్కనే ఉండి ధైర్యం చెప్పారు. ఆమె సమయస్ఫూర్తికి ప్రయాణికులంతా లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. డాక్టర్ అంజలి రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.