కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం: వడ్డాది గోవిందరావు

కృష్ణా: కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అంటూ గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డాది గోవిందరావు తన యువజన నాయకుడు వడ్డాది శివకృష్ణతో కలిసి ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ అవినీతి పాలన పోయి దేశం గర్వపడేలా పేద ప్రజల ఆనందపడేలా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వస్తుందని నమ్మకం వ్యక్తపరిచారు.