'గ్రామ పాలన అధికారుల నియామకం చేపట్టండి'
KNR: రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికో రెవెన్యూ అధికారిగా గ్రామ పాలన అధికారులను నియమిస్తామని ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులను GPOలుగా నియామకం చేపట్టకపోవడంపై నేడు కరీంనగర్ పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పూర్వ వీఆర్పీలు వినతిపత్రం ఇచ్చారు. వీలైనంత తొందర్లోనే GPOల నియామకం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.