కరెంట్ షాక్‌తో చేనేత కార్మికుడికి గాయాలు
అన్నమయ్య: మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రఘునాధ్ మునగ కాయలు కోయడానికి ఇంటి ఆవరణలోని చెట్టు ఎక్కాడు. కొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సకాలంలో వైద్యులు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.