ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 'ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల మతానికి చెందిన సోదరి(ఖురేషీ)ని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు' అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన AICC చీఫ్ ఖర్గే.. మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.