కానూరులో గుర్తు తెెలియని మృతదేహం లభ్యం..
NTR:పెనమలూరు మండలం కానూరులో ఆదివారం నవత ట్రాన్స్‌పోర్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు 45 ఏళ్ల వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడు నీలం, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.