యూరియా కావాలయ్యా..

యూరియా కావాలయ్యా..

WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కర్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. పంటకు యూరియా వేసే సమయం దాటుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల ఎకరాల్లో పత్తి, 3 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. పంట వేసిన 30, 60 రోజుల్లో యూరియా చల్లాల్సిన సమయం దాటుతుండటంతో  రైతులు తమ తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.