‘NDA డబ్బులు పంచి గెలిచింది’
బీహార్ ఎన్నికల్లో NDA విజయంపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. NDA కూటమి డబ్బులు పంచి విజయం సాధించిందని ఆరోపించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఈసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని, తమ విధులను సరిగా నిర్వర్తించలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ గెహ్లాట్ వ్యాఖ్యలు కీలకమయ్యాయి.