ఢిల్లీలో బాంబు పేలుడు.. జిల్లాలో హై అలర్ట్
వరంగల్: ఢిల్లీలో బాంబుపేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజా భద్రత పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని మంగళవారం విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో స్నిఫర్ డాగ్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.