సరస్వతి దేవికి విశేష పూజలు

CTR: పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.