శిల్పారామంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం
HYD: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యక్రమం'లో భాగంగా హైటెక్ సిటీలోని శిల్పారామంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో 200 కిలోల మున్సిపల్ వ్యర్థాలు, 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. జిల్లా పర్యాటక అధికారి ఎస్. ప్రభాకర్, స్విచ్చెకో బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సేవకులు భారీగా పాల్గొన్నారు.