VIDEO: ఇందిరమ్మ ఇంటికి కమీషన్ చెల్లించాలని దాడి..!

WGL: ఇందిరమ్మ ఇంటికి కమీషన్ చెల్లించాలని లబ్ధిదారులపై దాడి చేసిన ఘటన ఇవాళ పర్వతగిరి మండలం వడ్లకొండలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. కన్నె కల్పన- దేవేందర్ తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. మొదటి విడత రూ. లక్ష బ్యాంకులో జమయ్యాయి. దీంతో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కమీషన్ ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోవడంతో దాడి చేశారు.