సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
ASR: డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీ కొర్రగూడ గ్రామంలో సీసీ, డ్రైనేజీ పనులను బుధవారం సర్పంచ్ కిముడు హరి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనులకు 15వ ఆర్ధిక సంఘం నుండి 3 లక్షల నిధులను వినియోగిస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభించడంలో గ్రామస్తులు ఆనందించారు.