కత్తితో దాడి.. ముగ్గురికి గాయాలు
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు శివారులోని తుమ్మలగుంటపాలెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం దాడి జరిగింది. అత్తిలి మండలం మంచిలికి చెందిన రామచందర్రావు, మేనమామ కృష్ణతో కలిసి తన భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేశ్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.