రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కిష్టాపురం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ టయర్ పగిలి పక్కనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిన 108 వాహనం ద్వారా కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.