కొత్తగూడెం ట్రాఫిక్ ఏఎస్సైకి సేవా పతకం ప్రదానం
BDK: పోలీస్ విభాగంలో 37 ఏళ్లుగా విశిష్ట సేవలు అందించిన కొత్తగూడెం ట్రాఫిక్ ఏఎస్సై రఫీని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం గౌరవప్రదంగా సేవా పతకంతో సన్మానించారు. 1989 బ్యాచ్‌కు చెందిన రఫీ నిబద్ధతతో పనిచేస్తూ సహచరులకు ఆదర్శంగా నిలిచారని ఎస్పీ కొనియాడారు. విధుల్లో క్రమశిక్షణే ఆయనకు ఈ గుర్తింపు తెచ్చిందని సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.