VIDEO: పాకాలలో నాలుగు జిల్లాల మత్స్యకారుల సమావేశం
ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాలలో సోమవారం తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన జాలర్లు సమావేశమయ్యారు. తమిళనాడుకు చెందిన మరబొట్లు మన ప్రాంతంలోకి ప్రవేశించడంపై జాలర్లు చర్చించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడు జాలర్లను తమ ప్రాంతంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని వారు తీర్మానించారు.