బీఆర్ఎస్ మహిళ కార్యకర్తల నిరసన

బీఆర్ఎస్ మహిళ కార్యకర్తల నిరసన

SRPT: తుంగతుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోమవారం బీఆర్ఎస్ మహిళలు నిరసన ధర్నా నిర్వహించారు. బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇవ్వాలని, నెలకు మహిళలకు ఇస్తానన్న రూ.2,500ల ఆర్ధిక సాయం ఇవ్వాలని పలువురు మహిళలు అన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం, కళాశాల ఆడ పిల్లలకు స్కూటీలు అందజేయాలన్నారు.