పుస్తక మహోత్సవ కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం

పుస్తక మహోత్సవ కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని హోంమంత్రి వంగలపూడి అనితను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం నక్కపల్లిలో ఆమెకు బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు లక్ష్మయ్య ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఉత్తరాంధ్రలో మొదటిసారిగా పుస్తక మహోత్సవం జరుగుతుందని తెలిపారు.