యాచారం మండలంలో పర్యటించిన డీసీపీ
RR: మహేశ్వరం DCP నారాయణరెడ్డి యాచారం మండలంలో సోమవారం పర్యటించారు. మండల కేంద్రంతో పాటు గంగుల్‌లో పర్యటించిన ఆయన పలువురు రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.