కొత్త బీటీ రోడ్లకు నిధులు మంజూరు

NGKL: నియోజకవర్గంలోని పలు తండాలకు కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10.51 కోట్లు మంజూరయ్యాయని బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణ పనుల టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.