'భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
కర్నూలు: మహ శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరగాళ్లు ఆలయాల పేరిట నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు సృష్టించి మోసాలకు పాల్పడతారని భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ బుధవారం తెలిపారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, సురక్షితంగా మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏస్పీ తెలిపారు.