'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మత్తు పదార్థాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి చెడు తెలుసుకుని జీవితాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు.