శిథిలావస్థలో వంతెన
VZM: నారాయణపురం ఎడమ ప్రధాన కాలువపై దాదాపు 65 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో పాటు పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.