గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆగ్రహం

గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆగ్రహం

కృష్ణా: ఆదివారం ఇండిగో విమానాలలో ప్రయాణించిన ప్రయాణికులు తమ లగేజీని సమయానికి అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం దిగిన వారం రోజుల తర్వాత కూడా లగేజ్ అందకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో ఆందోళన చేపట్టారు. సంస్థ నిర్లక్ష్యం భరించలేనంతగా ఉందని మండిపడ్డారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించి, లగేజ్ అందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.