ప్రజా సమస్యలే అజెండాగా సాగిన సమావేశం
SKLM: కంచిలి MPDO కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం వాడీవెడీగా సాగింది. స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని సంబంధిత శాఖల నివేదికలను సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై చర్చలు నిర్వహించారు.