VIDEO: బొబ్బిలిలో కూలిన చెట్టు తొలగింపు

VZM: బొబ్బిలి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగిన సంగతి తెలిసిందే. పట్టణంలోని స్థానిక రైల్వే జంక్షన్ వద్ద చెట్టు విద్యుత్ లైన్ల పై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సోమవారం విద్యుత్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చెట్టును తొలగించారు. లైన్లు సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.