పరిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ
RR: కొత్తపేటలో పరిశుద్ధ్య కార్మికులకు దసరా పండగ సందర్బంగా నూతన వస్త్రాలను మాజీ సర్పంచ్ కామ్లెకార్ నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో చెత్తచెదారం వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. గత 8 సంవత్సరాల నుంచి దసరా పండగకు నూతన వస్త్రాలు ఇస్తున్నందుకు ఆయకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.