వాహనాలకు పొంచి ఉన్న ప్రమాదం
ప్రకాశం: పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని చెరువుకట్టపై వాహనాలకు పెను ప్రమాదం పొంచిఉంది. కట్టపై ఉన్న తారురోడ్డు భారీ వాహనాల బరువుకు ఒకవైపు కృంగిపోయింది. చెరువుకట్టకు ఒకవైపు లోతుఎక్కువగా ఉండటంతో వాహనాలు అందులో పడేఅవకాశం ఉందని స్థానికులు తెలిపారు. సంబంధిత R&B అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.