VIDEO: లింబాద్రిగుట్ట అర్చకులపై పోలీసులకు ఫిర్యాదు
NZB: భీమగల్ మండల ప్రెస్‌క్లబ్ సభ్యులు లింబాద్రిగుట్ట అర్చకులపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూస్ కవరేజ్ కోసం కొండపైకి వెళ్లిన జర్నలిస్టులపై కొందరు అర్చకులు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తమ కర్తవ్యంగా స్వామిపై భక్తితో వార్తలు రాస్తున్నామన్నారు. ఈ తరుణంలో రిపోర్టర్లను తోసి వేయడం, దాడులు చేయడం బాధాకరమన్నారు.