DSC పరీక్షకు సిద్ధమయ్యే వారికి ముఖ్య గమనిక

NTR: DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం అభ్యర్థులు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు ఈ. కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నెం.8, అశోక్ నగర్‌లోని స్టడీ సర్కిల్లో కుల, ఆదాయ, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.