రెవెన్యూ సేవలపై కలెక్టర్ ఫోకస్
TPT: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ రెవెన్యూ, మ్యుటేషన్, 22ఏ, రీ–సర్వే, PGRS, IVRS, క్యాస్ట్ వెరిఫికేషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లకు దిశానిర్దేశం చేశారు.