ఉరుకుంద దేవస్థానానికి భారీ విరాళం

ఉరుకుంద దేవస్థానానికి భారీ విరాళం

KRNL: కౌతాళం మండల ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్నస్వామి ఆలయ అభివృద్ధికి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ విషోక్ గురువారం ఒక లక్ష రూపాయిలు విరాళంగా అందజేశారు. దేవస్థానం వారు దర్శనం కల్పించి, శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం, పూలమాల, బాండ్ పేపర్‌తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు శివకుమార్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.