కడపలో మాంసం ధరలు తగ్గుదల
కడప నగరంలో గత వారంతో పోలిస్తే ఈ వారం మాంసం ధరలు తగ్గాయి. చికెన్ కిలో ధర రు.280 నుంచి రు.220–రు.240 మధ్యకు పడిపోగా, మటన్ ధర కిలోకు రు. 900గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రు.100 నుంచి రు. 500 వరకు ఉన్నాయి. ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని తెలిపారు.