VIDEO: ఇల్లందలో ఉత్సాహంగా బొడ్డెమ్మ వేడుకలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బొడ్డెమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాంప్రదాయంగా జరగనున్న ఈ పండగ రెండో రోజు శనివారం ఉత్సాహభరితంగా సాగింది. మొదటి రోజు గౌరమ్మ ప్రతిష్టతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఈరోజు కూడా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కోలాట బృందాల హాజరుతో వేడుకలు మరింత సందడిగా మారాయి.