టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు
KDP: TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న కడప నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో పార్టీ దిమ్మెలు ఏర్పాటు చేసి జెండాలు ఎగరవేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న పాత దిమ్మెలను శుభ్రపరచి, రంగులు వేసి జెండాలను గౌరవప్రదంగా ఎగరవేయాలని కోరారు.