VIDEO: సింగూరు జలాలు రావడంతో రైతుల ఆనందం
MDK: సింగూరు ప్రాజెక్ట్ నుంచి అధికారులు సాగు నీటిని విడుదల చేయడంతో పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మంజీరా నది ఒడ్డున మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, పట్లోళ్ల శశిధర్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడుపాక సర్పంచ్ కాశీనాథ్, నాయకులు పంతుల కిషన్, చారి, రాజు, సంతు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.