లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధల మధ్య ఈస్టర్ డే

లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధల మధ్య ఈస్టర్ డే

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో క్రైస్తవులు ఈస్టర్ డేను ఘనంగా నిర్వహించారు. జీసస్ మరణించి తిరిగి లేచిన దినంగా పరిగణిస్తూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సీఎస్ఐ చర్చి అధికారులు, ఫాదర్లు, క్రైస్తవులు క్యాండిల్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీసస్ శిలువ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వ మానవాళి కోసం, శాంతి కోసం జీసస్ చేసిన బోధనలు ఆచరణీయమన్నారు.