'శ్రామిక నగర్ సమస్యలు పరిష్కరించాలి'

GNT: పాతగుంటూరు శ్రామికనగర్‌లో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు అరుణ డిమాండ్ చేశారు. నగరంలో కురిసిన వర్షాలతో నిలిచిన నీటి సమస్యను స్థానికులు సీపీఎం నాయకుల దృష్టికి తీసుకురాగా మంగళవారం శ్రామిక నగర్‌లో సీపీఎం నాయకులు సందర్శించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.