అక్రమ ఇసుక డంపులు సీజ్
NZB: రెంజల్ మండలంలోని బోర్గం శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 20 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇసుకను డంపు చేసినట్లు సమాచారం రావడంతో దాడి చేసి సీజ్ చేసినట్లు ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ అధికారులు ఈశ్వర్, నిఖిల్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.