నూతన డీజీపీని కలిసిన జిల్లా ఎస్పీ
JGL: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్, డీజీపీ శివధర్ రెడ్డికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసింగ్ విధానాలపై డీజీపీ జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.