అంద శ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎంపీ
NLG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల భువనగిరి ఎంపీ చామర్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' అనే గీతాన్ని రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో 'జయ జయహే' తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.