బన్నీ కోసం భారీ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిన అట్లీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకొచ్చింది. ఇందులో బన్నీ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ను వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో బన్నీతో పాటు దాదాపు 300 వందల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కనిపించనున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.