'చంద్ర గ్రహణం పై అపోహలు వీడాలి'
KDP: చంద్ర గ్రహణం హాని కలిగిస్తుంది అన్న అపోహలు వీడాలని జన విజ్ఞాన వేదిక జాతీయ సమాచార కార్యదర్శి పి. సనావుల్లా అన్నారు. ఈ మేరకు ఆకాశంలో సంభవించే ప్రకృతి వైజ్ఞానిక అద్భుతాలలో చంద్ర గ్రహణం ఒకటి అని ఆయన తెలిపారు. ఈ మేరకు యువత టెలిస్కోప్ ద్వారా సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని ఆయన చెప్పారు. అనంతరం గ్రహణం సమయంలో గర్భిణులు బయటకు రాకూడదని, ఇతర నియమాలు కేవలం అపోహలే అన్నారు.