వ్యవసాయ మార్కెట్లో AMC ఛైర్మన్ కీలక సమావేశం
మార్కాపురం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ పరిధిలో కమిటీ ఫీజు వసూలు లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని ఎఎంసీ ఛైర్మన్ యారవ రమాశ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ లక్ష్యం సాధ్యమైందని చెప్పారు. రైతులు, వ్యాపారులు సహకరించడం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు.