VIDEO: ప్రోటోకాల్ ఉల్లంఘనపై డీకే అరుణ ఫైర్

VIDEO: ప్రోటోకాల్ ఉల్లంఘనపై డీకే అరుణ ఫైర్

WNP: అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీ డీకే అరుణ ఇవాళ ఆరోపించారు. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులకు మంత్రి వాకటి శ్రీహరి రాత్రికి రాత్రి శంకుస్థాపనలు చేయడంపై ఆమె మండిపడ్డారు. తనను ఆహ్వానిస్తే కేంద్ర నిధుల వివరాలు బయటపడతాయనే భయంతోనే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారికి విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు.