తొక్కిసలాట.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అంబులెన్సుల్లో స్వస్థలాలకు మృతదేహాలను అధికారులు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో టెక్కలికి చెందిన వారు ఇద్దరు, మందస వాసులు ముగ్గురు, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపు కొత్తూరుకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.