త్వరలో జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

ప్రకాశం: ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 5 లేదా 6వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు డ్వామా అధికారులకు సమాచారం వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు నీటి సంరక్షణ కోసం నిర్మించిన నీటి కుంటలను ఆయన పరిశీలించనున్నారు.