'రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ'

MNCL: లబ్దిదారులకు రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలోని లబ్ధిదారులకు1847 కొత్త రేషన్ కార్డులు, 60 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.